GOVERNOR BIRTHDAY: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
CM JAGAN: గవర్నర్ బిశ్వభూషణ్‌కు ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌కు ఫోనులో శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు గడపాలని ఆకాంక్షించారు.
CHANDRABABU AND LOKESH: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
PAWAN: గవర్నర్ బిశ్వభూషణ్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పురోగమనానికి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో ఉపయుక్తం అని కొనియాడారు. అవినీతిలేని సమాజం ఆవిష్కారం కావాలన్న మీ ఆకాంక్ష నేటితరానికి ఆదర్శం అని ప్రశంసించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: