బంద్ ప్రభావం: రాజధాని గ్రామాలకు భారీగా పోలీసు బలగాలు - రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు వార్తలు
అమరావతి గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
పాలన వికేంద్రీకరణ బిల్లును నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జరిగిన పరిణామాలను వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని రైతులు బంద్ చేస్తున్నారు. వారికి వర్తక, వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా.. పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం కూడలి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వెనుక వైపు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించే అవకాశముందని భావించిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామానికి రెండు వైపులా సోదాలు చేస్తున్నారు.