ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి కేసు: రోహత్గి నియామకంపై హైకోర్టులో వ్యాజ్యం

రాజధాని అమరావతి కేసులకు సంబంధించి ప్రభుత్వం తరపున వాదించేందుకు మాజీ అటర్నీ జనరల్​ ముకుల్ రోహత్గిని నియమించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 5 కోట్ల రూపాయల ఫీజు చెల్లింపును సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ముకుల్ రోహత్గికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Mukul Rohatgi
ముకుల్ రోహత్గి

By

Published : Feb 11, 2020, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details