ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొలువు కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు! - విశాఖ నేవీ ఎంపిక పరీక్షల్లో పుల్​అప్స్ తీస్తుండగా వ్యక్తి మరణం

దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపన పడ్డాడు. పరీక్ష కోసం అక్క వివాహ ముహూర్తాన్నే మార్పించాడు. ఎంపిక పరీక్షలకు హాజరై.. విధి వంచించి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో అతడి స్వగ్రామం తెలంగాణ జిల్లా జయశంకర్ భూపపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరంలో తీవ్ర విషాదం అలుముకుంది.

person dead in navy rally
మరణించిన సాయికృష్ణ

By

Published : Nov 28, 2020, 6:21 PM IST

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన.. రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ. ఇండియన్‌ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. దేహదారుఢ్య పరీక్ష ఉన్న రోజునే సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.

స్నేహితుడితో కలిసి సాయికృష్ణ ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు విశాఖ పైపులైన్‌ జంక్షన్‌ వద్ద నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి.. వెంటనే పులప్స్‌ తీస్తుండగా కుప్ప కూలిపోయాడు. నేవీ సిబ్బంది తక్షణమే ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.

ABOUT THE AUTHOR

...view details