ఏదైనా సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదని, థియేటర్లలో విడుదల చేస్తే రూల్స్ పాటించాల్సిందేనని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఓ ఛానల్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ)తో ఆయన ఫోన్లో సంభాషించారు. సినిమా టికెట్ ధరల విషయమై మరోసారి స్పందించారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
Movie Ticket Rates: థియేటర్లలో విడుదల చేస్తే రూల్స్ పాటించాల్సిందే: పేర్నినాని
థియేటర్లలో విడుదల చేస్తే రూల్స్ పాటించాల్సిందేనని మంత్రి పేర్ని నాని అన్నారు. ఓ ఛానల్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ)తో ఆయన ఫోన్లో సంభాషించారు. సినిమా టికెట్ ధరల విషయమై మరోసారి స్పందించారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
మంత్రి అనే విషయాన్ని పక్కనపెడితే తానూ ఓ సినిమా అభిమానినని అన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఎప్పటి నుంచో అమల్లో ఉందని, తానూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా పెట్టింది కాదన్నారు. సినిమా టికెట్ ధరల విషయంలో గత ప్రభుత్వాలూ కోర్టును ఆశ్రయించాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏప్రిల్‌లో జారీ చేసిన జీవోను ఓ న్యాయమూర్తి సమర్థించారని, ఇటీవల మరో జడ్జి దానిలో కొన్ని మార్పులు చేయాలన్నారని తెలిపారు. ఏదైనా సినిమాని శాటిలైట్, ఓటీటీకి అమ్మినపుడు ప్రభుత్వంతో సంబంధం ఉండదన్నారు. థియేటర్లలో విడుదల చేసినపుడు రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తి ఎందుకు తీర్పు ఇస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'టికెట్ రేట్ల లాజిక్ ఏంటో ఏపీ ప్రభుత్వం మాకూ చెప్పాలి'