అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని పేరుతో ఉద్ధండరాయునిపాలెంలో నిర్వహించిన సదస్సుకి శైలజానాథ్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడ రాజధాని ఉండాలనే అంశాన్ని స్పష్టంగా తాము చెప్పకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి ఎంత తప్పు చేశామో....రాజధానిని ఎక్కడ నిర్మించాలనే నిర్ణయాన్ని చెప్పకపోవటం అంతే తప్పని అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యనించారు.