రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ అభిమాని ఊహించని కానుక ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో జనసేనాని పర్యటన ప్రారంభమవగానే... ఓ అభిమాని వచ్చి ఆయనకు చెప్పులు బహూకరించారు. మొదటిసారి తమ ప్రాంతానికి వచ్చారని... చిరు కానుక స్వీకరించాలని ప్రాదేయపడ్డాడు. రాజధాని నేలపై తానిచ్చిన పాదరక్షలతో నడవాలని కోరాడు. అభిమాని కోరిక మేరకు రాజధాని ప్రాంతంలో ఆ పాదరక్షలు ధరించి జననేత పర్యటించారు.
జనసేనానికి అభిమాని బహుమానం..ఏంటంటే..!
ఎవరి మీదైనా అభిమానం ఉంటే.. ఒక్కసారైనా కలవాలని..ఏదైనా గుర్తుండే విధంగా ఇవ్వాలని తహతహలాడుతారు. అయితే ఆ వ్యక్తే తమ దగ్గరకు వస్తే ఆ సంతోషానికి హద్దే ఉండదు. రాజధాని పర్యటనకు వచ్చిన జనసేనానికి ఇలాంటి బహుమతే ఇచ్చాడు ఓ అభిమాని.
జననేత, అభిమానికి మధ్య మాటామంతి