ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జూడాలతో వ్యవహరించే తీరు ఇదేనా?: పవన్​కల్యాణ్ - జనసేన

ఎన్ఎంసీ బిల్లుపై వైద్యుల ఆందోళన విషయంలో ప్రభుత్వ వైఖరిపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

pa1kalyan

By

Published : Aug 8, 2019, 11:05 AM IST

Updated : Aug 8, 2019, 11:24 AM IST

జూనియర్ డాక్టర్ల ఆందోళనపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తీరు బాధాకరమన్నారు. జూనియర్‌ వైద్యులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రతిభతో వైద్య విద్య అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూడాలు ఎన్నో సేవలందిస్తున్నారనీ.. వారి డిమాండ్లపై సరిగా స్పందించకపోవడం ఎంత మాత్రం సబబు కాదని అన్నారు. ఆందోళనపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న పవన్‌కల్యాణ్‌... యువ వైద్యులు, వైద్య విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపాల్సిన అవసరమూ ఉందని చెప్పారు.

పవన్ కళ్యాణ్ లేఖ
Last Updated : Aug 8, 2019, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details