రాజ్యాంగ రచయిత, భారతరత్న అంబేడ్కర్ చూపిన మార్గంలో జనసేన ప్రస్థానం కొనసాగిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తన అసమాన ప్రతిభతో భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి అంబేడ్కర్ ముఖ్య కారకులన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు ఎనలేనివని అభిప్రాయపడ్డారు. ఆయన స్ఫూర్తితోనే జనసేన పార్టీ ఏర్పాటు చేసినట్లు పవన్ తెలిపారు.
'అంబేడ్కర్ చూపిన మార్గంలోనే.. జనసేన కొనసాగుతోంది' - pawan kalyan on ambedkar
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలోనే జనసేన పార్టీ కొనసాగుతుందన్నారు.
అంబేడ్కర్‌కు పవన్ నివాళులు