ఆంధ్రప్రదేశ్‌ను వైకాపా నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. సేవ్ ఏపీ ఫ్రం వైకాపా అంటూ ట్వీట్ చేశారు. మద్యం ఆదాయం తాకట్టుతో తెచ్చే అప్పులు.. సంక్షేమ, సుపరిపాలన కాదని అన్నారు. నేటి 'నవరత్నాలు' భావితరాలకు 'నవ కష్టాలు' అని.. వైకాపా వాగ్దానాల అమలులో కనిపిస్తున్న కటిక నిజాలని పేర్కొన్నారు.
Pawan Kalyan Tweet : 'సేవ్ ఏపీ ఫ్రం వైకాపా'
వైకాపా పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ప్రజలపై పన్నులు రుద్దుతున్నారని మండిపడ్డ ఆయన.. "సేవ్ ఏపీ ఫ్రం వైకాపా" అంటూ ట్వీట్ చేశారు.
pawan kalyan
మద్య నిషేధమని చెప్పి .. రుణాలకు భద్రతగా మద్యం ఆదాయం చూపారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని..ట్రూ అప్ పేరిట పెంచేశారని పవన్ ఇసుక ధర తగ్గిస్తామని చెప్పి.. ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ హక్కులు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీకి బలమైన రాజధాని నిర్మిస్తామని.. ఇప్పుడు రాజధానే లేకుండా చేశారని ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి:Minister Anil Kumar: 'మాకు పవన్‌కల్యాణ్.. సంపూర్ణేశ్‌బాబు ఇద్దరూ ఒకటే!'
Last Updated : Sep 27, 2021, 11:44 AM IST