రాష్ట్రానికి బలమైన రాజధాని ఉండాలనే ఆనాడు భాజపా, తెదేపాకు మద్దతిచ్చానని పవన్‌కల్యాణ్ ఉద్ఘాటించారు. రాజధాని పర్యటనలో భాగంగా తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దతిచ్చిన పవన్ మాట్లాడారు. గతంలో ఏ ఉద్యమమూ అమరావతి కోసం జరిగినన్ని రోజులు జరగలేదన్నారు. యూపీఏ తెచ్చిన ఎన్నో విధానాలను ఎన్డీయే కొనసాగించిందని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు బాగుండాలి, సమగ్రాభివృద్ధి జరగాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు. ఎవరు వచ్చినా, రాకున్నా రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని పునరుద్ఘాటించారు.
రాజధాని రైతులకు అండగా నేనుంటా: పవన్
ఎన్డీఏలో వైకాపాను చేర్చుకుంటున్నారన్న ప్రచారం వాస్తవమైతే రాజధాని తరలింపు అంశంలో ప్రధాని మోదీ కూడా భాగమయ్యారని భావించాల్సి వస్తుందని... రాజధాని ప్రాంత రైతులు వ్యాఖ్యానించారు. భాజపాతో కలిసి పనిచేస్తోన్న పవన్‌కల్యాణ్ ఈ విషయంలో చొరవ తీసుకొని వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. దీనిపై జనసేనాని స్పష్టతనిచ్చారు. మూడు రాజధానుల అంశంలో కేంద్రం అనుమతి లేదని స్పష్టం చేశారు.
తుళ్లూరులో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
Last Updated : Feb 15, 2020, 6:24 PM IST
TAGGED:
తుళ్లూరులో పవన్ కల్యాణ్