ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళలపై వేధింపులకు పాల్పడిన వారికి ఎంపీ టికెట్లా'

మంత్రి పదవుల కోసం వైకాపా మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భజన చేస్తున్నారని తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవించిన నేతలకు ఎంపీ టికెట్లు ఇచ్చిన ఘనత వైకాపాదని విమర్శించారు. మైనారిటీ మహిళపై అఘాయిత్యాలకు ఒడిగట్టిన నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆమె మండిపడ్డారు.

By

Published : Dec 9, 2019, 8:49 PM IST

panchumarhi anuradha criticizes ycp mps
తెదేపా నేత పంచుమర్తి అనురాధ

పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం
మంత్రి పదవుల కోసం వైకాపా మహిళా ఎమ్మెల్యేలు సీఎంను పొగడటం మానాలని తెదేపా నేత పంచుమర్తి అనురాధ సూచించారు. హిందూపురం ఎంపీపై అత్యాచార కేసు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలుగా ఉన్నారని, అటువంటి వారికి వైకాపా ఎంపీలుగా టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంగళగిరిలో మాట్లాడిన ఆమె.. మహిళలపై వైకాపా నేతలు అరాచకాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి ఒక మహిళ అధికారిని‌ అర్థరాత్రి బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఒక మహిళను అత్యాచారం చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో వైకాపా కార్యకర్త... మైనారిటీ మహిళలపై అత్యాచారం చేస్తే ఇంతవరకు అతనికి శిక్ష విధించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 12,653 మంది మహిళలపై అత్యాచారాలు, దాడులు, వరకట్న వేధింపుల ఘటనలు జరిగాయని, ఆయేషా మీరా కేసు పక్కదారి పట్టించిన మాజీ సీఎం రాజశేఖర్​రెడ్డి ఎవరికి‌ న్యాయం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details