జూరాల గేట్లు ఎత్తిన అధికారులు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. జలాశయానికి 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలకుగాను... ప్రస్తుతం 9.500 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం పెరగడం వల్ల జలాశయం 6 గేట్లు తెరిచి 28,641 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650, కోయిల్ సాగర్‌కు 630, కుడి కాలువకు 252, ఎడమ కాలువకు 700, పార్లల్ కెనాల్‌కు 900 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుండటంతో.... ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని ఆరు జల విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వరద ప్రవాహం పెరగటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన