శాసనసభ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ఆన్ లైన్ ద్వారా ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై.. గవర్నర్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. రాజ్ భవన్ నుంచి ముందస్తు సన్నాహాలు నిర్వహించారు.
గవర్నర్ ఆన్లైన్ ప్రసంగానికి ఏర్పాట్లు పూర్తి.. అధికారుల సమీక్ష - ఆంధ్రప్రదేశ్ శాసనసభ వార్తలు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక తెరలు ఏర్పాటు చేశారు.
officials reviewed
గవర్నర్ ప్రసంగం వినేందుకు.. శాసనసభ, మండలిలో ప్రత్యేక తెరలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం.. 10 గంటలకు జాతీయ గీతాలాపనతో.. కార్యక్రమం ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.