Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,169 కొవిడ్ కేసులు, 53 మరణాలు
15:56 June 22
నిన్నటితో పోల్చితే పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4,169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. వైరస్ బారి నుంచి మరో 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 53,880 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరిలో 659, చిత్తూరులో 472 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.
ఇదీ చదవండి:మాన్సాస్ ట్రస్ట్ ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు బహిర్గతం చేయాలి: అశోక్ గజపతిరాజు