తెలంగాణలో కరోనా కేసులు 2 లక్షల 45 వేల 682కు చేరుకున్నాయి. తాజాగా.. రాష్ట్రంలో 1,539 కరోనా కేసులు నమోదవగా.. ఐదుగురు మరణించారు. కరోనా మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 1,362 మంది మృతి చెందారు.
తెలంగాణ: తగ్గని కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,539 కొవిడ్ కేసులు - covid cases update
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా మరో 1,539 కరోనా కేసులు, ఐదు మరణాలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో కొత్త కరోనా కేసులు
కొవిడ్ నుంచి మరో 978 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,25,664కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 15,864 మంది బాధితులున్నట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 285 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు.