ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి నుంచి భారత్​ బయోటెక్​ నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​ తొలిదశ ట్రయల్స్

nasal drop covaxin first phase clinical trial in February-March
ఫిబ్రవరి నుంచి భారత్​ బయోటెక్​ నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​ తొలిదశ ట్రయల్స్

By

Published : Jan 8, 2021, 12:39 PM IST

Updated : Jan 8, 2021, 1:44 PM IST

12:37 January 08

భారత్ బయోటెక్‌

 ఫిబ్రవరి నుంచి భారత్​ బయోటెక్​ నాజల్ డ్రాప్​ టీకా​ తొలిదశ ట్రయల్స్​ను ప్రారంభించనుంది. ముక్కుద్వారా ఇచ్చే టీకా ప్రీక్లినికల్ పరీక్షలు విజయవంతమయ్యాయని సంస్థ వెల్లడించింది.

కొవాగ్జిన్​తో పాటు ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఫిబ్రవరి-మార్చిలో ముక్కు ద్వారా అందించే టీకా తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు.  

వాషింగ్టన్ వర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పటికే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్​కు డీసీజీఐ అనుమతిచ్చింది.  

ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఒక్క డోసు మాత్రమే ఇస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ వ్యాక్సిన్​తో మెడికల్ వ్యర్థాలు గణనీయంగా తగ్గనున్నట్లు వెల్లడించింది. 

ఇదీ  చూడండి.రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్‌

Last Updated : Jan 8, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details