సంక్షేమ పథకాలు గడపకే అందించాల్సిన వాలంటీర్లు మామూళ్లు వసూలు చేస్తున్నారని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్శ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఓ గ్రామంలో వాలంటీర్లు డబ్బు వసూలు చేశారంటూ లబ్దిదారులు చేసిన ఆరోపణల వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే... వాలంటీర్లు వేలల్లో చేతివాటం చూపిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు
'యథా సీఎం.. తథా వాలంటీర్లు'
'యథా ముఖ్యమంత్రి, తథా వాలంటీర్లు' అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎం లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే ... వాలంటీర్లు వేలల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై 'మామూళ్లు అంటూ వాలంటీర్లు తమ వద్ద డబ్బులు తీసుకున్నారని బాధితులు మొరపెట్టుకున్న' ఓ వీడియోను లోకేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
నారా లోకేశ్ ట్వీట్