- లోకేశ్ మీడియా సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
LOKESH NARASARAOPETA TOUR: నరసరావుపేట పర్యటన ఆపేది లేదు: లోకేశ్ - NARA LOKESH GUNTUR TURE
15:36 September 09
మీడియాపై ఆంక్షలు
15:34 September 09
సీఆర్‌పీసీ నోటీసులు జారీ
- లోకేశ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన కృష్ణలంక పోలీసులు
13:48 September 09
విజయవాడ చేరుకున్న నారా లోకేశ్ కాన్వాయ్
- విజయవాడ చేరుకున్న నారా లోకేశ్ కాన్వాయ్
- కృష్ణా వారధి వద్ద ఆగిన నారా లోకేశ్ కాన్వాయ్
- ఉండవల్లిలోని ఇంటికి తీసుకెళ్తామన్న పోలీసులు
- నరసరావుపేట పర్యటన ఆపేది లేదన్న లోకేశ్
- నారా లోకేశ్, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం
- పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన నారా లోకేశ్
- తనను చేయిపట్టి లాగడాన్ని ప్రశ్నించిన లోకేశ్
- రాతపూర్వక ఆదేశాలు చూపించాలని నిలదీసిన లోకేశ్
- లోకేశ్‌ను అడ్డుకోవడంపై వివరణ కోరిన న్యాయవాదులు
- 41ఏ సీఆర్‌పీసీ కింద లోకేశ్‌కు రోడ్డుపైనే నోటీసు రాసిచ్చిన పోలీసులు
13:14 September 09
ఉండవల్లిలోని లోకేేశ్ నివాసం వద్ద పోలీసుల మోహరింపు..
- అమరావతి: ఉండవల్లిలోని లోకేశ్ నివాసం వద్ద పోలీసుల మోహరింపు
- సీతానగరం నుంచి చంద్రబాబు నివాసం వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత
12:51 September 09
పోలీసుల అదుపులో లోకేశ్‌తో పాటు పలువురు తెదేపా నేతలు
- తెదేపా నేత లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పోలీసుల అదుపులో లోకేశ్‌తో పాటు పలువురు తెదేపా నేతలు
- ఎక్కడికి తరలించేది గోప్యంగా ఉంచిన పోలీసులు
12:50 September 09
నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు: లోకేశ్
- నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు: లోకేశ్
- నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు: లోకేశ్
- ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నా: లోకేశ్
- కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తా: లోకేశ్
- పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు: లోకేశ్
12:26 September 09
లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం వచ్చిన నారా లోకేశ్
- పర్యటనకు అనుమతి లేదని లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు
12:10 September 09
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నారా లోకేశ్
- గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నారా లోకేశ్
- హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేశ్
- గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో నరసరావుపేట వెళ్లనున్న లోకేశ్
- హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించనున్న లోకేశ్
- ముప్పాళ్ల మం. గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష
- లోకేశ్ నరసరావుపేట పర్యటన కోసం వెళ్తున్న తెదేపా నేతల అరెస్టు
- తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్టు, గృహనిర్బంధం చేసిన పోలీసులు
11:56 September 09
పరామర్శకు వెళ్తే ప్రభుత్వానికి ఉలుకెందుకు?: అచ్చెన్నాయుడు
- పరామర్శకు వెళ్తే ప్రభుత్వానికి ఉలుకెందుకు?: అచ్చెన్నాయుడు
- అఘాయిత్యాలు అడ్డుకోవడం మాని.. పరామర్శలు అడ్డుకుంటారా?: అచ్చెన్న
- నిందితులను వదిలేసి అండగా నిలిచేవారి అరెస్టు దుర్మార్గం: అచ్చెన్న
- ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైనవారికి భరోసా కల్పించడం తప్పా?: అచ్చెన్న
- బాధితులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న వారి అరెస్టు దుర్మార్గం: అచ్చెన్న
11:53 September 09
తెదేపా నేతల నిరసన..
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలపై నారా లోకేష్ పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని చదలవాడ అరవింద బాబు ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులపై అధికార పార్టీ అండదండలతో పోలీసులు అడ్డుకోవడం దుశ్చర్యగా నరసరావుపేట నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. దిశ, నిర్భయ చట్టాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
09:54 September 09
విజయవాడలో తెదేపా నేత బుద్ధా వెంకన్న గృహనిర్బంధం
- విజయవాడలో తెదేపా నేత బుద్ధా వెంకన్న గృహనిర్బంధం
- బుద్ధా వెంకన్న నివాసం వద్ద తెదేపా కార్యకర్తల నిరసన
09:51 September 09
గుంటూరులోని వసంతరాయపురంలో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
- గుంటూరులోని వసంతరాయపురంలో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
- లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గం: ఆనందబాబు
- రమ్య కుటుంబానికి తెదేపా అండగా నిలిచిందని పోలీసులు కక్షగట్టారు: ఆనందబాబు
- పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదు: నక్కా ఆనందబాబు
09:50 September 09
చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహనిర్బంధం
- చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహనిర్బంధం
- నివాసం నుంచి బయటకు రాకుండా ప్రత్తిపాటిని నిర్బంధించిన పోలీసులు
- నరసరావుపేట లోకేశ్ పర్యటనకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు
09:38 September 09
తాడేపల్లిలో తెదేపా నేత శ్రావణ్‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు
- తాడేపల్లిలో తెదేపా నేత శ్రావణ్‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు
- ఫిరంగిపురంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా అరెస్టు
- ఫిరంగిపురం వెళ్లాలని పట్టుబట్టడంతో ఎస్.ఐ.ను తోడుగా పంపిన పోలీసులు
09:38 September 09
నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో జీవీ ఆంజనేయులు అరెస్టు
- నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో జీవీ ఆంజనేయులు అరెస్టు
- జీవీ అరెస్టును నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత కార్యకర్తల ధర్నా
09:04 September 09
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గృహనిర్బంధం
- పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గృహనిర్బంధం
- గుంటూరులోని నివాసంలో కొమ్మాలపాటి శ్రీధర్ గృహనిర్బంధం
- పరామర్శకు వెళ్తున్న లోకేశ్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణం: శ్రీధర్
08:52 September 09
లోకేశ్ పర్యటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చినరాజప్ప ఆగ్రహం
- లోకేశ్ పర్యటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చినరాజప్ప ఆగ్రహం
- అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?: చినరాజప్ప
- అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అనుమతి నిరాకరిస్తారా?: చినరాజప్ప
- వైఎస్ వర్ధంతికి లేని కరోనా నిబంధనలు పరామర్శకు వెళ్తుంటే వచ్చాయా?: చినరాజప్ప
- నారా లోకేశ్‌ను అడ్డుకోవాలని చూడడం సరికాదు: చినరాజప్ప
08:29 September 09
నారా లోకేశ్ పర్యటన నేపథ్యంలో తనిఖీలు
- తాడేపల్లి: ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసుల తనిఖీలు
- తాడేపల్లి: నారా లోకేశ్ పర్యటన నేపథ్యంలో తనిఖీలు
08:25 September 09
గుంటూరులో తెదేపా నేత ఆలపాటి రాజా గృహనిర్బంధం
- గుంటూరులో తెదేపా నేత ఆలపాటి రాజా గృహనిర్బంధం
- నరసరావుపేట లోకేశ్ పర్యటనకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు
- గుంటూరు రింగ్‌రోడ్డులో నివాసం వద్ద రాజాను అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన ఆలపాటి రాజా
08:24 September 09
నరసరావుపేటలోని ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు
- నరసరావుపేట తెదేపా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
- తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవిందబాబు గృహనిర్బంధం
- సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు
- తెదేపా కార్యాలయంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల గృహనిర్బంధం
- విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి తీరుతామన్న చదలవాడ అరవిందబాబు
08:24 September 09
విజయవాడలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం
- విజయవాడలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం
- కార్పొరేటర్ దేవినేని అపర్ణను గృహనిర్బంధం చేసిన పోలీసులు
- రామవరప్పాడులో కార్పొరేటర్ ఉషారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
08:11 September 09
హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ నిర్ణయం
- తెదేపా నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ
- హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ నిర్ణయం
- ముప్పాళ్ల మం. గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష
- మరోవైపు నరసరావుపేటలో మహాధర్నాకు పిలుపునిచ్చిన తెదేపా
- గుంటూరులో రమ్య హత్య జరిగి 21 రోజులైనా శిక్ష వేయలేదంటూ నిరసన
- ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న లోకేశ్
- గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో నరసరావుపేట వెళ్లనున్న లోకేశ్
- లోకేశ్ పర్యటనకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- కొవిడ్ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు
- గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- విమానాశ్రయంలోకి ఎవరినీ అనుమతించని పోలీసులు
- నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వందమంది పోలీసు బలగాలు
- విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత
- విజయవాడ నుంచి విమానాశ్రయం వరకు చెక్‌పోస్టులు పెట్టిన పోలీసులు
- విమానాశ్రయం పరిసరాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
- తెదేపా నేతలు విమానాశ్రయం వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు