విశాఖ ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో కులవివక్ష దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏయూలో జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అణగారిన వర్గాల హక్కులకు దిక్కుగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని.. సీఎం జగన్ అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతల దౌర్జన్యాలు, అణచివేతలతో దళితులు దగా పడ్డారని విమర్శించారు.
కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించినందుకే మహాసేన రాజేశ్‌పై రౌడీషీట్ తెరిచారని దుయ్యబట్టారు.