తమిళనాడులో ఇటీవల పట్టుబడిన 5.27 కోట్ల డబ్బుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్....ప్రభుత్వంపై ఎదురుదాడి మరింత పెంచారు. మంత్రి బాలినేనిని జె-కుటుంబం రక్షిస్తోందా లేక జె-కుటుంబాన్ని బాలినేని కాపాడుతున్నారా..? అని అనుమానం వ్యక్తం చేశారు. హవాలా రాకెట్‌ను పెంచి పోషించటానికి మంత్రి బాలినేని ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించారని లోకేశ్ నిలదీశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో పట్టుబడిన 5.27కోట్లు.....1200కోట్ల నల్లధనంలో కొంత మాత్రమేనని అన్నారు. ఏడాదిలో 1200 కోట్లను చెన్నై-బెంగళూరు నుంచి హవాలా ద్వారా మారిషస్‌కు పంపారని ఆరోపించారు. దీనివెనుక ఉన్న సూత్రధారి ఎవరని ప్రశ్నించారు.
మంత్రి బాలినేనిని 'జె' కుటుంబం రక్షిస్తోందా..? లోకేశ్
మంత్రి బాలినేని కుటుంబాన్ని జె కుటుంబం రక్షిస్తోందా లేక జె- కుటుంబాన్ని బాలినేని కాపాడుతున్నారా..? అని తెదేపా నేత నారా లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడులో డబ్బు దొరికిన ఘటన వెనుక ఉన్న అసలు సూత్రదారి ఎవరని ప్రశ్నించారు.
nara lokesh