కృష్ణా జిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో ఎంపీ నందిగం సురేశ్ ఫిర్యాదు చేశారు. తనపై దౌర్జన్యం చేసి వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారంటూ... ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత సిబ్బందిపై తెదేపా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దాడి చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు... 14 మందిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం అమరావతికి మద్దతుగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎంపీ సురేశ్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నందిగామ పోలీసులకు ఎంపీ సురేశ్ ఫిర్యాదు
తనపై దౌర్జన్యం చేసి... వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారంటూ... టీఎన్ఎస్ఎఫ్ నేతలపై వైకాపా ఎంపీ నందిగం సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
nandigama suresh complaint to police