ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నలంద కిశోర్​ను కర్నూలుకు తరలించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్నారన్న ఆరోపణలతో... నిన్న అరెస్టు చేసిన ఇద్దరిని సీఐడీ పోలీసులు కర్నూలుకు తరలించారు. కర్నూలు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

nalandha kishore arrest issue
తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్ కర్నూలుకు తరలింపు

By

Published : Jun 24, 2020, 12:37 PM IST

Updated : Jun 24, 2020, 10:22 PM IST

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులు ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణతో అరెస్టైన విశాఖ నగరానికి చెందిన నలంద కిశోర్​, కృష్ణాజిల్లా నందిగామ మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన చిరుమామిళ్ల కృష్ణారావును నిన్నపోలీసులు అరెస్టు చేశారు. వీరిని కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.

నాలుగు రోజుల కిందట ఇదే తరహా కేసులో కర్నూలు నగరానికి చెందిన షేక్ మోతీలాల్ ను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసును... ప్రభుత్వం కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి అప్పగించటంతో... నిందితులను కర్నూలుకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం... కోర్టులో హాజరుపరచనున్నారు

  • రాత్రిపూట అరెస్టులపై అభ్యంతరం..

నలంద కిషోర్‌ను రాత్రి 3 గంటలకు ఇంట్లోకి వచ్చి అరెస్టు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బీపీ, షుగర్ రోగిని రాత్రిపూట అరెస్టు చేయాల్సిన అవసరమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్

Last Updated : Jun 24, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details