ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ప్రేయసి కోసం మతం మారిన భాస్కర్​కు చేదు అనుభవం - hrc

ప్రేయసి కోసం మతం మార్చుకున్న తెలంగాణ వికారాబాద్​కు చెందిన భాస్కర్​కు హెచ్​ఆర్​సీలో చేదు అనుభవం ఎదురైంది. నిఖత్​ అభ్యర్థన మేరకు భాస్కర్​ అలియాస్​ హునైన్​ పిటిషన్​ను మానవ హక్కుల సంఘం ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య కొట్టివేశారు. తన తండ్రిని మద్యానికి బానిసను చేసి మోసం చేశాడని నిఖత్​ ఆరోపించగా... నిఖత్​ మాటలన్నీ అవాస్తవమని హునైన్​ చెప్పాడు.

muslim converted man complaints in hrc over his love issue at hyderabad
ప్రేయసి కోసం మతం మారిన భాస్కర్​కు చేదు అనుభవం

By

Published : Feb 11, 2020, 10:40 PM IST

ప్రేయసి కోసం మతం మారిన భాస్కర్​కు చేదు అనుభవం

ప్రేమించిన యువతితో పెళ్లి కోసం మతం మారిన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యువకుడు భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ హునైన్​కు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో చేదు అనుభవం ఎదురైంది. హునైన్ పెట్టుకున్న దరఖాస్తును మానవ హక్కుల సంఘం కొట్టివేసింది. వికారాబాద్ జిల్లా లాలగూడకు చెందిన భాస్కర్... మన్నెగూడలో ఉంటోన్న నిఖత్​ను ప్రేమించానని, వాళ్ల పెద్దల సూచన మేరకు ఇస్లాంలో చేరి పూర్తిగా మారిపోయాడు. పెళ్లి చేస్తానన్న అమ్మాయి తరఫు వారు దాడి చేసి మోసం చేశారని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. హునైన్ అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ చంద్రయ్య... నిఖత్​ను కోర్టులో హాజరుపర్చాలని స్థానిక మహిళా పోలీసులను ఆదేశించారు.

నిఖత్​ అభ్యర్థన మేరకు కొట్టివేత

మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు వికారాబాద్ మహిళా పోలీస్ ఇన్​స్పెక్టర్ సుష్మిత.... నిఖత్​ను కోర్టులో హాజరుపర్చారు. నిఖత్, హునైన్​ల వాదనలు విన్న జస్టిస్ చంద్రయ్య... నిఖత్ అభ్యర్థన మేరకు హునైన్ పిటిషన్​ను కొట్టివేశారు. హునైన్ తన తండ్రిని మద్యానికి బానిసను చేసి మోసం చేశాడని, తనను తీవ్రంగా వేధిస్తున్నాడని నిఖత్ ఆరోపిస్తోంది. నిఖత్ మాటలన్నీ అవాస్తవమని, మత పెద్దలు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని హునైన్ వేడుకుంటున్నాడు. నిఖత్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీ చూడండి:

'మతం మారడమే కాదు... ప్రేమకోసం ఎందాకైనా వెళ్తా!'

ABOUT THE AUTHOR

...view details