ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెయిల్‌పై ఉన్నారని జగన్ గుర్తుంచుకోవాలి: ఎంపీ రఘురామరామకృష్ణరాజు - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్స్​

Raghu Ramakrishna Raju: రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా మాట్లాడకూడదని ఎంపీ రఘురామరామకృష్ణరాజు అన్నారు. బెయిల్‌పై ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రత్యేక అంశంపై సవరణ చేయాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు మద్యనిషేధమని మాట్లాడిన మాటలు గుర్తులేవా? అని.. అధికారంలోకి వచ్చాక మాటమారుస్తారా? అని విమర్శించారు.

Raghu Ramakrishna Raju
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Mar 25, 2022, 4:10 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు

Raghu Ramakrishna Raju: సాక్షాత్తూ అసెంబ్లీలో సీఎం జగన్‌ న్యాయవ్యవస్థపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా మాట్లాడకూడదని సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న రఘురామ.. జగన్ బెయిల్‌పై ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 3 రాజధానులు అమలు చేయాలంటే పార్లమెంటులో సవరణ చేయక తప్పదని రఘురామ అన్నారు. అసత్యాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details