ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Three Capitals Repeal Bill: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ వెనుక రాజకీయ కుట్ర: కనకమేడల

రాజధాని అంశంపై న్యాయస్థానంలో వచ్చే తీర్పును అడ్డుకునేందుకే (Three Capitals Repeal Bill news) జగన్ సర్కారు కొత్త నాటకానికి తెరలేపిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో తీర్పు రానుందని పసిగట్టి మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు.

Kanakamedala On Three Capitals Repeal Bil
కనకమేడల

By

Published : Nov 24, 2021, 3:36 PM IST

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala On Three Capitals Repeal Bill) అన్నారు. రాజధాని అంశంపై న్యాయస్థానంలో వచ్చే తీర్పును అడ్డుకునేందుకే జగన్ సర్కారు కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన ఆయన.. న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రానుందని పసిగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

మూడు రాజధానుల బిల్లులో ఎన్నో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని, ఆ బిల్లు ఏ కోర్టులోనూ నిలబడదని ఆయన స్పష్టం చేశారు. ఇది గ్రహించే న్యాయపరిధి దాటి, న్యాయమూర్తులపై వైకాపా నేతలు ఆరోపణలకు దిగారని కనకమేడల ఆరోపించారు.

ఇప్పుడు మెరుగైన బిల్లు పెడతామన్న ముఖ్యమంత్రి.. మొదటి బిల్లు అసంపూర్ణంగా పెట్టానని తనకు తానే ఒప్పుకున్నారన్నారు. ఏదేమైనా.. 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ మాహాపాదయాత్ర చేస్తున్న రైతుల తొలి విజయంగా ఆయన పేర్కొన్నారు. రైతుల పాదయాత్రకు భయపడుతున్న సర్కారు.. మద్దతు తెలిపేవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. క్రమశిక్షణతో సాగుతున్న పాదయాత్రకు మద్దతు తెలిపే వారిని పోలీసులు బెదిరించడం సరికాదని అన్నారు.

ఇదీ చదవండి

Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ

ABOUT THE AUTHOR

...view details