ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు ప్రజలు ఉండటానికే కాదు.. పశువులు కట్టేసుకోవడానికీ పనికిరావని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తెదేపా అడ్డుకుంటోందని వైకాపా మంత్రులు ప్రచారం చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వరదలకు మునిగిన ఇళ్ల వరదలు పోయి నెలరోజులు దాటినా ఇళ్ల స్థలాల్లో నిలిచిన నీళ్లు మాత్రం పోలేదని ధ్వజమెత్తారు. అలాంటి చోట ఇళ్ల స్థలాలు ఇచ్చి తమను ముంచుతుంటే ప్రజలు కోర్టుకెళ్లకుండా ఉంటారా అని ప్రశ్నించారు.
'ఆ ఇళ్ల స్థలాలు పశువులు కట్టడానికీ పనికిరావు'
పేదల ఇళ్ల స్థలాలు నివాసయోగంగా లేవని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ అన్నారు. వరదలు పోయి నెలరోజులైనా ఇళ్ల స్థలాల్లో నీళ్లు నిలిచి ఉన్నాయని అన్నారు.
ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ