ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది?' - విజయసాయిరెడ్డి

కరోనా రాగానే హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి... చంద్రబాబు గురించి మాట్లాడటమా..? అని తెదేపా నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని దుయ్యబట్టారు.

mlc Buddha Venkanna
mlc Buddha Venkanna

By

Published : Aug 17, 2020, 9:10 PM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా జగన్​ విఫలం అయ్యారనే ఆందోళన... మళ్లీ తమరని కరోనా కాటేస్తుందనే భయం వెంటాడుతునందుకే చంద్రబాబు గురించి పరితపిస్తున్నారా అని విమర్శించారు. కరోనా రాగానే జగన్​ పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్​ పారిపోయి వైద్యం చేయించుకోలేదా..? అని ప్రశ్నించారు.

కరోనాపై పోరాడుతున్నమని చెబుతున్న వ్యక్తి... తాడేపల్లిలోని ఇంట్లో పడుకొని ఆరునెలల అయిందని దుయ్యబట్టారు. ట్విటర్​లో తమరు... వీడియో కాన్ఫరెన్స్​ల్లో జగన్​ అర్థం కాని తెలుగులో కబుర్లు చెప్పటం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details