ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagga Reddy about Revanth : 'రేవంత్ మంచి చేస్తే అభినందిస్తా.. కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తా'

Jagga Reddy about Revanth: అధిష్ఠానానికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదని.. త్వరలోనే తెలుసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విద్యార్థుల కోసం తాను ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేశానని ఈ సందర్భంగా వివరించారు. ఇకపోతే పార్టీలో ఎన్ని అంతర్గత విభేధాలున్నా.. ప్రజల కోసం కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.

Jagga Reddy about Revanth
Jagga Reddy about Revanth

By

Published : Dec 28, 2021, 9:14 PM IST

'రేవంత్ మంచి చేస్తే అభినందిస్తా.. కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తా'

Jagga Reddy about Revanth: టీపీసీసీ రేవంత్ రెడ్డి మంచి చేస్తే అభినందిస్తా.. కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్​పై అధిష్ఠానానికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలవదని.. అదెలా జరిగిందో తెలుసుకుంటానని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా ఎవరిని అడిగి చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చేశానని గాంధీ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

నా లేఖ.. నాకు తెలియకుండా మీడియాకు లీక్ అయ్యింది. హైదరాబాద్ అనేది అందరికీ జాగీర్దార్. ధర్నాలు చేయడం అందరికీ హక్కు ఉంటుంది. మాలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నా.. మా మీదకు ఎవరొచ్చినా కలిసి పోరాడతాం. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి కట్టుగా పోరాడతాం. అంతర్గతంగా మాలో మాకు ఎన్నో ఉంటాయి. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడను.

-జగ్గారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

'హైదరాబాద్ అనేది అందరిదీ.. ధర్నాలు చేయడానికి అందరికీ హక్కు ఉంటుందని' అన్నారు. తమకు ఎన్ని విభేదాలు ఉన్నా.. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. పార్టీపరంగా అంతర్గతంగా ఎన్నో ఉంటాయని.. వాటి గురించి తాను మాట్లాడనని అన్నారు.

ఇదీ చదవండి:APPSC Job Notifications: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details