మూడు రాజధానుల అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. 3 రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపింది. హైకోర్టులో విచారణలో ఉన్నందున సమాచారమివ్వడం కుదరదని వెల్లడించింది. దరఖాస్తును అప్పిలేట్ అథారిటీకి పంపుతున్నట్టు తెలిపింది.
AndhraPradesh: హైకోర్టు పరిధిలో మూడు రాజధానుల అంశం: కేంద్ర హోంశాఖ - ఏపీ తాజా వార్తలు
three capitals for ap
21:36 July 13
అప్పిలేట్ అథారిటీ దరఖాస్తు
గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు.
ఇదీ చదవండి
Last Updated : Jul 13, 2021, 10:33 PM IST