కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మిగతా రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడం సహ ఉద్యోగులంతా సైనికుల్లా కరోనాపై యుద్ధం చేయడం వల్ల కరోనా వ్యాప్తిని సమర్థంగా నిలువరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 100 బెడ్ల చొప్పున రాష్ట్రంలో 20వేల క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. విదేశాల నుంచి వారిని వాలంటీర్లతో సాయంలో గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 వేల మందిని గుర్తించినట్లు తెలిపారు. రెడ్ జోన్లలోనూ వాలంటీర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు విలేకరులు పనిచేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు ఆరోపణలు దారుణం : పేర్ని నాని