ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటల భాజపాలో చేరడంపై తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి కామెంట్స్ - తెలంగాణ వార్తలు

ఇన్ని రోజులు భాజపాను విమర్శించిన ఈటల.. మళ్లీ అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సిందని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.

minister jagadeesh reddy
ఈటల భాజపాలో చేరడంపై తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి కామెంట్స్

By

Published : Jun 14, 2021, 8:05 PM IST

ఈటల భాజపాలో చేరడంపై తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి కామెంట్స్

నిన్నటి వరకు భాజపాను విమర్శించి.. నేడు అదే పార్టీలో ఈటల రాజేందర్‌ చేరడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెరాసను వీడితే వారికే నష్టం తప్ప తమ పార్టీకేమీ కాదని స్పష్టం చేశారు. గుంపును వదిలి అడవిలోకి పోతే.. మృగాల పాలవుతారన్నారు.

ఈటల రాజేందర్‌కు తెరాసలో సముచిత స్థానం కల్పించామని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నిరోజులు భాజపా హిట్లర్​ పార్టీ అంటూ విమర్శించి.. అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈటల చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని మంత్రి ఆరోపించారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సిందని జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details