ఈ ఏడాది డిసెంబరులో.. తిరుపతి నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 20 నైపుణ్యాభివృద్ధి కళాశాలలకు భూకేటాయింపు ప్రక్రియ పూర్తైందని ఆయన తెలిపారు. సచివాలయంలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు.
తిరుపతిలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంతో పాటు విశాఖ, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో నైపుణ్య కళాశాలలను ప్రారంభించేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన నిధుల సమీకరణపై మంత్రి చర్చించారు. నవంబరు 15 నాటికి సమగ్ర పరిశ్రమ సర్వేను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.