పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళిక: మంత్రి అవంతి
దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను గుర్తించి... అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సాగుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో జరిగిన పర్యాటక మంత్రుల సమావేశంలో అవంతి పాల్గొన్నారు.
minister-avanthi-on-delhi
కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో దిల్లీలో పర్యాటక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. ఏపీ నుంచి సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. పర్యాటకరంగంలో కొత్తగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.