రైతు బజార్ల వద్ద నిబంధనలు అమలుకావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అసహనం వ్యక్తం చేశారు. లాక్డౌన్ లక్ష్యం నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి వస్తున్నారని, అందుకే వాటిని వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో ఇళ్లకు 3 కిలోమీటర్లలోపు రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యావసర షాపులు ఉదయం 6 నుంచి 1 గంట వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల ప్రజలు గుమిగూడకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
బ్లాక్ మార్కెట్‌పై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు