ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థుల భవిష్యత్​ ముఖ్యం.. రాజకీయాలు వద్దు: మంత్రి సురేష్ - ap ssc exams

కరోనా కారణంగా విద్యావ్యవస్థలో మార్పులు వచ్చాయని.. వాటిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. గత ప్రభుత్వం సాంకేతిక విద్య విషయంలో వైఫల్యం చెందిందని.. అందుకే ఆ దిశగా కసరత్తు చేపట్టామని తెలిపారు.

minister adimulapu suresh
ఏపీలో పది పరీక్షలు యధాతథం

By

Published : Apr 24, 2021, 5:39 PM IST

విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువూ ముఖ్యమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అనంతపురంలో అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం.. విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సాంకేతిక విద్య విషయంలో వైఫల్యం చెందిందన్న మంత్రి.. ఆ విషయంపై కసరత్తు చేపట్టామని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు.. అభివృద్ధి దిశగా సాగుతున్నాయని మంత్రి సురేష్ తెలిపారు. కానీ... కొన్ని రాజకీయ పార్టీలకు అవి మరో రకంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విపరీత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. పదో తరగతి పరీక్షలకు.. 11 సబెక్టులు ఉంటే 7కి కుదించి నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details