ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ - బ్రహ్మంగారి మఠం తాజా వార్తలు

బ్రహ్మంగారి మఠం దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామీ రెండో భార్య మారుతీ మహాలక్ష్మీ డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. కొందరు కుట్రపూరితంగా అలజడులు సృష్టించి పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అలజడులు సృష్టించకుండా తమకు హానీ తలపెట్టకుండా చూడాలని ఆమె డీజీపీని కోరారు.

brahmamgari matam
brahmamgari matam controversy

By

Published : Jun 12, 2021, 3:35 PM IST


కడప జిల్లా బ్రహ్మంగారిమఠం(Brahmamgari Matham)లో పీఠాధిపత్యం కోసం కొందరు కుట్రపూరితంగా అలజడులు సృష్టించి కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామీ రెండో భార్య మారుతీ మహాలక్ష్మీ (maruthilakshmamma) డీజీపీ గౌతం సవాంగ్ (dgp sawang)​కు లేఖ రాశారు. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పీఠాధిపత్యం వివాదాన్ని పరిష్కరించేందుకు ఇవాళ సాయంత్రం రెండు రాష్ట్రాల నుంచి 20 మఠాధిపతులు.. బ్రహ్మంగారిమఠానికి వస్తున్న సందర్భంలో మహాలక్ష్మీ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 2, 3 తేదీల్లో శివస్వామి (shivaswamy) ఆధ్వర్యంలో వచ్చిన మఠాధిపతుల చర్చల్లో తాము అయిష్టంగా పాల్గొన్నామని ఆమె లేఖలో పేర్కొన్నారు.

డీజీపీకి మహాలక్ష్మీ లేఖ

కొందరు మధ్యవర్తుల జోక్యంతో వేరొకరికి కుట్రతో పీఠాధిపత్యం కట్టబెట్టాలని చూస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం సమస్యను తామే పరిష్కరించుకుంటామని.. ఇతర ప్రాంతాల మఠాధిపతుల జోక్యం అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి అలజడులు సృష్టించకుండా తమకు హానీ తలపెట్టకుండా చూడాలని ఆమె డీజీపీని కోరారు.

డీజీపీకి మహాలక్ష్మీ లేఖ

ABOUT THE AUTHOR

...view details