ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రను బయటపెట్టినా.. పేకాట, భూ దందాపై ఆధారాలు చూపినా.. చర్యల్లేవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుని కక్షసాధింపులో భాగంగానే ఇరికించారని అన్నారు. భూముల కొనుగోళ్లపై మంత్రి జయరాం స్వయంగా ఓ టీవీ ఛానల్ చర్చలో అంగీకరించారంటూ లోకేశ్ సంబంధిత వీడియోను ట్వీట్ చేశారు.
ఈఎస్ఐ కుంభకోణంలో ఆధారాలు చూపినా.. సీఎం స్పందించరే..: లోకేశ్
ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి జయరాం పాత్రను బయటపెట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని నారా లోకేశ్..సీఎం జగన్ ను ప్రశ్నించారు. కావాలనే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నను ఇరికిస్తున్నారని అన్నారు.
lokesh tweet on esi scam in ap