వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్‌ను పెయిడ్ ఆర్టిస్ట్‌గా గుర్తించడం మంచిదంటూ... తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చి... అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తూ... బయట మాత్రం తాము ఆ బిల్లుకు వ్యతిరేకమని ప్రచారం చేస్తారని ధ్వజమెత్తారు. 16 ఆగస్టు 2019న ఎన్ఆర్సీపై గెజిట్ నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం గుర్తుచేశారు. కడప సభలో పౌరసత్వ బిల్లు అమలు చెయ్యబోమని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటని తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కాబట్టి... ఎంతకైనా దిగజారుతారని ధ్వజమెత్తారు.
'అప్పుడు మద్దతిచ్చి... ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..?' - సీఎం జగన్‌పై లోకేష్ ట్వీట్
ఎన్ఆర్సీ బిల్లుకు మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్... కడప సభలో అమలు చెయ్యబోమని చెప్పటంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మడమ తిప్పే నాయకుడు కాబట్టే... ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
సీఎం జగన్‌పై లోకేష్ ట్వీట్