వెంకటపాలెం, దొండపాడు, అనంతవరం గ్రామాలలో రైతుల నిర్వహించిన దీక్షా శిబిరాలకు నారా లోకేశ్ వెళ్లారు. అమరావతికి మద్దతుగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. వైకాపా మంత్రులు తమను ఇష్టానుసారంగా తిడుతున్నారంటూ మహిళలు లోకేష్ ముందు కన్నీటిపర్యంతమయ్యారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని..... అమరావతికి పునర్వైభవం వస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిని సాధించుకునే వరకూ.. ఉద్యమాన్ని కొనసాగించాలని లోకేశ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో మహిళలు ఉద్యమం చేస్తే తాము దిల్లీ స్థాయిలో న్యాయపోరాటం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
అమరావతిని చంపేందుకు వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుంది:లోకేశ్
పసిబిడ్డ లాంటి అమరావతిని చంపేందుకు వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అందుకే అమరావతిపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులు, మహిళల పోరాటానికి ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి సంఘీభావం తెలిపారు.
అభివృద్ధి చేస్తారానుకుంటే.. అమరావతిని నాశనం చేశారు: లోకేశ్
తుళ్లూరు ధర్నా శిబిరాన్ని సందర్శించిన లోకేశ్.. రైతులు, మహిళల పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమరావతి ప్లాప్ సినిమా కాదని.. ఇక్కడికి వస్తే అది ఎలాంటి సినిమానో చూడాలంటే రాజధానికి బొత్స రావాలని చెప్పారు. ఆనాడు అమరావతికి అంగీకరించిన జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.
Last Updated : Oct 12, 2020, 8:32 PM IST