రాష్ట్రంలో దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందనడానికి నంద్యాల సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యే నిదర్శనమని జై భీమ్ జస్టిస్ యాక్సిస్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ అన్నారు. సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదు... ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. రాష్ట్రంలో దాడులను, అఘాయిత్యాలను ఖండించకుండా పరిహారం పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. సలాం కుటుంబాన్ని పోలీసులు మానసికంగా వేధించారని ఆరోపించారు.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని, రాష్ట్రంలో దళితులు, బీసీ, మైనారిటీ వర్గ బాధితులకు జై భీమ్ జస్టిస్ యాక్సిస్ ఎప్పుడు తోడుగా ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో పోలీసుల పనితీరుపై డీజీపీ దృష్టి పెట్టాలన్నారు.
సంబంధిత కథనాలు