Krishna board: కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు అప్పగింత, ప్రాజెక్టుల అనుమతుల గడువు నేటితో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.... ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహణ కోసం బోర్డులకు స్వాధీనం చేయాలని కేంద్ర జలశక్తి శాఖ గతేడాది నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డులకు స్వాధీనం చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాతో పాటు అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా అందులో పొందుపర్చింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని, లేదంటే వాటిని నిలిపివేయాలని అందులో పేర్కొంది.
గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును మాత్రమేస్వాధీనం చేస్తామని తెలంగాణ తెలిపింది. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టుల స్వాధీనంపై సానుకూలంగా స్పందించలేదు. కృష్ణా ప్రాజెక్టులకు చెందిన తమ కాంపోనెంట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్......... తెలంగాణ కాంపోనెంట్లను అప్పగిస్తేనే స్వాధీనం చేసుకోవాలని షరతు పెట్టింది. ఫలితంగా ప్రాజెక్టుల స్వాధీనం జరగలేదు.