ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kodali Nani on Casino: తెదేపా నేతలకు జీవితకాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం: కొడాలి నాని

Kodali Nani on Casino: గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని తెదేపా నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు రూ. 500 కోట్లు వచ్చాయంటున్న తెదేపా నేతలు...50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు.

కొడాలి నాని
కొడాలి నాని

By

Published : Jan 29, 2022, 12:42 PM IST

Updated : Jan 29, 2022, 2:45 PM IST

Casino: గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని తెదేపా నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు రూ. 500 కోట్లు వచ్చాయంటున్న తెదేపా నేతలు.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు. గుడివాడలో తనను ఓడించలేకే.. లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలకు అన్ని తెలుసన్న నాని.. 3రోజుల క్యాసినోకు 362రోజులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా నేతలకు జీవిత కాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం అని స్పష్టం చేశారు.

విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన సీఎంకు పాదాభివందనాలు: కొడాలినాని

ఎన్టీఆర్​ను ఆరాధించే వ్యక్తిగా ఆయన అభిమానుల తరఫున జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనాలు చేస్తున్నానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. నూతనంగా ఏర్పడిన విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ కృష్ణాజిల్లా గుడివాడ లోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొడాలి నాని క్షిరాభిషేకాలు నిర్వహించారు. సిద్ధాంతపరంగా వైఎస్ఆర్, ఎన్టీఆర్ భిన్న ధ్రువాలైన, ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ ,వైయస్సార్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఇదీ చదవండి:రైల్లో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 29, 2022, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details