ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మన ఓటు వివరాలు తెలుసుకుందాం ఇలా.. - ఎన్​వీఎస్​పీ యాప్ ద్వారా ఓటు వివరాలు

స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను ఇంటివద్ద నుంచే తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆన్​లైన్​లో సౌకర్యం కల్పించింది. 'నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్' (ఎన్​వీఎస్​పీ)ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్​ఫోన్​లో తెలుసుకునేందుకు 'ఓటర్స్ హెల్ప్​లైన్ యాప్' ​ను అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ప్రతిఒక్కరూ తమ ఓటు వివరాలను సులభంగా పొందవచ్చు.

know your vote details through NVSP app
మన ఓటు వివరాలు తెలుసుకుందాం ఇలా

By

Published : Mar 13, 2020, 12:44 PM IST

ఓటు వివరాలు తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆన్​లైన్​లో సౌకర్యం కల్పించింది. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ పద్ధతిలో ఓటు వివరాలు తెలుసుకునేందుకు www.nvsp.in వెబ్​సైట్​లో ఓటర్ల వివరాలు పొందుపర్చింది.

ఓటు వివరాలు ఇలా తెలుసుకోండి...

* నెట్​లో ఈ సైట్ ఓపెన్ చేయగానే.. సెర్చ్ ఇన్ ఎలక్షన్ రోల్​ను ఎంపిక చేసుకోవాలి.

* దీనిలో 'సెర్చ్ బై డిటైల్స్', లేదంటే 'సెర్చ్ బై ఎపిక్ నంబరు' అని రెండు విధాలుగా ఓటరు తమ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

* సెర్చ్ బై డిటైల్స్​లో ఓటరు పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం పేరును నమోదు చేసి పరిశీలిస్తే పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. సెర్చ్ బై ఎపిక్ నంబరు ద్వారా ఓటరు ఐడీ నంబరు ఎంటర్ చేసి ఓటు వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఓటరు హెల్ప్ యాప్ ద్వారా...
'ఓటర్ హెల్ప్​లైన్ యాప్'​ను డౌన్​లోడ్ చేసుకుంటే లాగిన్ ఐడీ అవసరం లేకుండా వివరాలు పొందవచ్చు. యాప్​లోకి వెళ్లగానే స్కిప్ లాగిన్​ను ఎంపిక చేసుకోవాలి. దీనిలో సెర్చ్ బై డిటైల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబరు ద్వారా వివరాలు పొందవచ్చు. సెర్చ్ బై డిటైల్స్​లో ఓటరు పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలను క్లిక్ చేసి పరిశీలిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) ఎంటర్ చేసి ఓటు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి.. ఆ 30 మంది ఓటర్లకు ఇవే చివరి ఎన్నికలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details