కేబినెట్ మంత్రిగా గంగాపురం కిషన్ రెడ్డి(KISHAN REDDY) బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ట్రాన్స్పోర్ట్ భవన్‌లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.కుటుంబ సభ్యులతో కలిసి అయన కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి(KISHAN REDDY) బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రులు మీనాక్షి లేఖి, అజయ్ భట్ పాల్గొన్నారు. అనంతరం..శాస్త్రి భవన్‌లో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
నమ్మకం నిలబెట్టుకుంటా..
పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు కిషన్ రెడ్డికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలను కట్టబెట్టారు. కేబినెట్ లో తనకు చోటు కల్పించినందుకు మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని..ప్రధానికి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబట్టుకుంటానని కిషన్ రెడ్జి తెవిపారు.తనను పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు మరోసారి.. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి:CM JAGAN TOUR: అనంతపురం జిల్లా రాయదుర్గం చేరుకున్న సీఎం జగన్
చిత్తశుద్ధితో పనిచేస్తా..
కేంద్ర సహాయమంత్రిగా ఇప్పటివరకు పలు చట్టాలు చేయటంలో భాగస్వామ్యమయ్యాను. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా అంతే చిత్తశుద్ధితో కృషి చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. 1980 నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాను. అప్పడు సాధారణ కార్యకర్తగా ఎలా పనిచేశానో.. ఇప్పుడు కూడా అంతే సేవాభావంతో కృషి చేస్తా. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇది మరుపురాని సంఘటన. ఈ స్థాయికి రావటానికి కారణమైన... నన్ను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
తెలుగు గడ్డకు గర్వకారణం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా ఎంపిక కావటం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ కిషన్ రెడ్డి పట్ల గర్విస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా భారత దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి : కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ
కేబినెట్ మంత్రిగా.. పదోన్నతి పొందిన కిషన్‌రెడ్డికి రాష్ట్ర భాజపా శుభాకాంక్షలు తెలిపింది. తనకు కేటాయించిన శాఖలను అభివృద్ధి చేయడంలో ఆయన తప్పక తన వంతు కృషి చేస్తారని అభిప్రాయపడింది. తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో చాటిచెప్పేలా అహర్నిషలు శ్రమించాలని కోరింది.