అవినీతి పథకాల కోసం అతిగా అప్పులు చేసేందుకే వైకాపా ప్రభుత్వం నగదు బదిలీకి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. రైతులు, దళితులు, బలహీనవర్గాలను నిండా ముంచేందుకే...ఈ పథకం తీసుకొచ్చారని విమర్శించారు. అవినీతి, దుబారా తగ్గించుకుంటే ఇప్పుడు వస్తున్న ఆదాయంతోనే జీతాలతో పాటు పథకాలన్నీ అమలు చేయవచ్చని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాదికి సరాసరి 26వేల కోట్లు అప్పు చేస్తే జగన్ 63 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. మరిన్ని అప్పులు చేసేందుకే ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
అప్పులు చేసేందుకే నగదు బదిలీ పథకం:కాలవ శ్రీనివాసులు
వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మరిన్ని అప్పులు చేసేందుకే ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
kalava srinivasulu