ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేశారు' - Kala Venkat rao comments on YCP

రేపట్నుంచి 45 రోజులపాటు తెదేపా ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర జరగనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. ప్రజాచైతన్య యాత్ర కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ప్రజాచైతన్య యాత్రను ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Kala Venkat rao criticize Jagan's Government
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

By

Published : Feb 18, 2020, 5:07 PM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

వైకాపా నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. వైకాపా 9 నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారన్న వెంకట్రావు... మరిన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా జె-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జె-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details