కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఏడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కాకతీయ 22వ తరం వారసులైన కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం.. ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు
నేటి నుంచి వారం పాటు కాకతీయ సప్తాహ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో కాకతీయ 22వ తరం వారసులైన కమల్ చంద్ర భంజ్ దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు మొదలైనవి నిర్వహించనున్నారు.
కాకతీయ వైభవ సప్తాహం
ఇందుకోసం ఆయన చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి వరంగల్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్ చంద్ర భంజ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. అటు కాకతీయ కట్టడాల నిర్మాణంలో దాగిన సాంకేతికతపై సదస్సులు, కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి :