ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసు.. జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపా విడుదల - ts news

MINISTER SRINIVAS MURDER conspiracy : దిల్లీలో అరెస్టయిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ తిలక్‌ థాపా సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితులు రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజుకి దిల్లీలో జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపా, వ్యక్తిగత సహాయకుడు రాజు ఆశ్రయం ఇచ్చారని పోలీసుల అభియోగం.

jitender-reddy-driver-tafa-released
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసు.. జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపా విడుదల

By

Published : Mar 4, 2022, 9:50 AM IST

MINISTER SRINIVAS MURDER conspiracy : దిల్లీలో అరెస్ట్‌ అయిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ తిలక్‌ థాపా సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు. అనంతరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. ఈ సందర్భంగా థాపాను అభినందించిన బండి సంజయ్‌.. ఆయనతో సమావేశమై అరెస్టు పరిణామాలపై చర్చించారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితులు రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజుకి దిల్లీలో జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపా, వ్యక్తిగత సహాయకుడు రాజు ఆశ్రయం ఇచ్చారని పోలీసుల అభియోగం. దీంతో ముగ్గురు నిందితులతో పాటు థాపాను కూడా అరెస్టు చేసిన పేట్‌ బషీర్‌బాద్‌ పోలీసులు దిల్లీ నుంచి వారిని హైదరాబాద్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, గురువారం సాయంత్రం థాపాను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details