భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3 లేదా 4న విశాఖలో పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ సమాలోచనలు జరిపారు. పాదయాత్రకు సంబంధించిన బాధ్యతలు తోట చంద్రశేఖర్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చేయాల్సిన పనులు, అధినేత భద్రత వంటి అంశాలపై చర్చించారు.
పవన్ పాదయాత్ర బాధ్యతలు చంద్రశేఖర్‌కు అప్పగింత
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3 లేదా 4న జనసేన నిర్వహించనున్న పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. పాదయాత్రకు సంబంధించిన బాధ్యతలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించారు.
జనసేన పార్టీ నేతల సమావేశం